Happy New year 2021 - 2021నూతన సంవత్సర శుభాకాంక్షలు - नव वर्ष 2021 की हार्दिक शुभ कामनाएँ..

                         

                                    2021     నూతన  సంవత్నర శుభాకాంక్షలు

గౌరవనీయులైన పెద్దలకు, ప్రియ మితృలకు, ప్రియాతి ప్రియమైన చిన్నారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనందరి జీవితాలలో ఈ నూతన సంవత్సరం చాలా విశిష్టమైంది. ఎందుకంటే 2020 అనే ఒక ఆతి విలక్షణ  సంవత్నరంలో   ఏ యుగంలోను ఎవరు చూడని కరోనా అనే మహామారిని చూసాం. కనిపించని ఆ మహామారితో దైర్యంగా పోరాడి, దాని నుండి బయట పడినందుకు మనందరం మనల్ని మనం అభినందించుకోవాలి. మనందరి సమైక్య పోరాటం వలననే మనం ఈ రాకాసి వ్యాది నుండి బయట పడకలిగాం. అయినా మనం దానిని పూర్తిగా అంతం చేయలేక పోయాం . ఈ సంవత్సరం మన ప్రధమ లక్ష్యం కరోనాను అంతం చేయడమే కావాలి. ఇంతకు ముందు లాగానే మనం దానిని నిరోదించటానికి, రూపుమాపటానికి తగిన జాగ్తత్తలు తీసుకుంటూ ఉండాలి. 

      మన ఎదుట బలమైన శత్రువు ఉన్నప్పుడే మనం మన బలహీనతలనుండి బయట పడటానిని తగిన ప్రయత్నం చేసి, బలంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తాం. ఈ కరోనా ను ఎదుర్కోటానికి దేశ ప్రజలందరు అటువంటి ప్రయాత్నాలే చేశారు. స్వచ్ఛ భారత్ ను కేవలం మాటలలోనే ప్రదర్శించే చాలా మంది పౌరులు, కరోనా భయంతో ఎవరికి వారు పరిశుభ్రతము పాటించారు. శని వారం, ఆదివారం నగరాలలో సినిమాలకు, రెస్టారెంట్లకు, ఇంకా అనేక దురలవాట్లకు వందల, వేల రూపాయలు ఖర్చు పెట్టి, డబ్బును, కొన్ని సందర్భాలలో ఆరోగ్యాన్ని పాడుచేసుకునే వారు. ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కుదురుగా ఉండటం    నేర్చుకున్నారు. లాక్ డౌన్ ల నమయంలో మహానగరాలలో వాయుకాలుష్యం చాలా వరకు తగ్గింది. 

       కరోనా కాలంలో దేశప్రజలలో భక్తి, ఆధ్యత్మికత చాలా పెరిగింది. లాక్ డౌన్ కాలంలో అత్యధిక కష్టనష్టాలను ఎదుర్కొన్నవారు వలస కార్మికులు.చేతివృత్తులవారు, నిరుద్యోగులైన చిరుద్యోగులు, చిరు వ్యాపారులు. అటువంటి లక్షలమందిని మన దేశ ప్రజలందరు కలసి ఆదుకున్నారు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాలు అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవటానికి సాయశక్తుల కృషిచేశాయి. ప్రధాని మోది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా రాకాసిని రూపుమాపటానికి అహర్నిశం పాటుపడ్డారు.

 హిందీ నటుడు అక్షయ్ కుమార్ పి.యమ్.కేర్స పండ్ కు 25 కోట్ల రూపాయలిచ్చి తన పెద్ధ మనసును చాటుకున్నాడు. కోటీశ్వరులైన పారిశ్రామిక వేత్తలనుండి, బిచ్చమెత్తుకునే వారి వరకు అందరూ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో రకాలుగా కరోనా బాధితులని ఆదుకున్నవారు. కరోనా వలన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్ లక్షలాది కుటుంబాలు కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. కాలగమనంలో వచ్చే సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవడం కొన్నివేల సంవత్సరాల చరిత్ర ఉన్న భారత దేశానికి  క్రొత్తేమి కాదు.ఈ నమయంలో  గురజూడ మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకుందాం...

 

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా

సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్  

దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్‌!!!!!

ఈ నూతన సంవత్సరం అందరికి ఆయురారోగ్యములను, సుఖశాంతులను ప్రసాదించు గాక   ! జయ్ హింద్..జయ్ భారత్...     

-  బి. విశ్వనాథాచారి.

Comments