ఈరోజు ఘంటసాల వర్ధంతి.(11.02.1974)వారికి స్వరార్చన చేస్తున్న శ్రీ దొంతోజు...
https://youtu.be/jiPIQxgS004
ఈ రోజు అమర గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి.
( ది.11.02.1974) ఆయనకు హృదయ పూర్వక శ్రద్ధాంజలి. ఈ సందర్భంగా 7.02.2021న పోతవరంలో ఘంటశాల మండపంలో శ్రీ దొంతోజు కృష్ణస్వామి మరియ మిత్రమండలి వారు అత్యంత వైభవంగా ఘంటసాల ఆరాధనోత్సవాలను నిర్వహించారు ఈ వీడియోలో కృష్ణస్వామిగారు ఘంటసాలకు స్వరార్చన చేయగా, చిరంజీవి భవ్య తబలా వాయిస్తూ ఘంటశాలకు శ్రద్ధాంజలి ఘటించింది. అలాగే ఘంటసాల పాటలు పాడే కళాకారులు, ఆయన పాటలు పాడి ప్రేక్షకుల హృదయాలను రంజింపచేశారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత నాధస్వర విద్వాంసులు శ్రీ రామవరపు సహదేవుడు, వారి శ్రీమతి నాగమణి గార్లకు ఆపూర్వ సన్మానం జరిగింది. ఆ దంపతులు తమ నాదస్వర కచేరిలో శివశంకరి, నీ లీల పాడెద దేవా అనే పాటలను వినిపించి, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఘంటసాలకు అంతటి ఘనమైన నివాళి అర్పించిన కళాకారులు,శ్లీ దొంతోజు కృష్ణస్వామి మరియ మిత్రమండలి మరియు పోతవరం గ్రామస్తులు ధన్యులు.
Comments
Post a Comment