పురుషోత్తమ ప్రాప్తి యోగం -భగవద్గీత - లఘు ప్రవచనాలు(Short speeches))




https://www.youtube.com/playlist?list=PLu38b3-OK_bWNVY_fYsOODacMWCZhad
శ్రీమద్భగవద్గీత యందు పురుషోత్తమ ప్రాప్తి యోగం పరమ విశిష్టమైనది. పురుషోత్తముడనగా సాక్షాత్ పరమాత్మయే. ఆ పరమాత్ముని పొందుటయే ఆత్మస్వరూపుడైన జీవుని లక్ష్యము. ఈ అధ్యాయములో శ్రీకృష్ణపరమాత్మ ఈ విషయములను అర్జునునకు సవిస్తరముగా తెలియపరిచాడు. తాను వైశ్యానరుడిగా సమస్త జీవుల దేహాన్ని ఆశ్రయించి జఠరాగ్నిగా ఆహారాన్ని జీర్ణము చేయునది.సమస్త లోకాలను పోషించేది తానే నని భగవానుడు విశదపరుస్తూ, జీవుడు కూడా సనాతనుడు మరియుఅతడు తన అంశయే  అని స్పష్టపరిచాడు. పరమేశ్వరుడు పార్వతిదేవని ఉపదేశించిన గీతా మాహాత్మ్యములో ఈ అధ్యాయము పారాయణ చేయుటవలన సర్వపాప నివృత్తి మరియు ఉత్తమ మోక్షగతి కలుగుతుందని తెలుపబడింది.
        ఈ అధ్యాయములో ఆహారమును పచనము చేయు వైశ్యానరుని ప్రస్తావన ఉండుటవలన పలు ఆశ్రమములో, మఠములో , గృహములలో భోజనసమయములో భక్తిపరులు ఈ అధ్యాయమును (20శ్లోకములు )పారాయణ చేసి ఆహారమును భుజిస్తారు. ఇట్లు చేయుట మనము స్వయముగా భగవానునికి నైవేద్యము పెట్టుటయే అగుచున్నది. ఈ అధ్యాయమును చదివిన తరువాత అరచేతి యందు నీళ్లు తీసుకొని, ఈ క్రింది శ్లోకము

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ  సమాధినా II
                     (భగవద్గీత 4వ అధ్యాయం 24 వ శ్లోకం)  

 చదివిన తరువాత ఆ నీటిని పరబ్రహ్మ స్వరూపమైన అన్నముపై చల్లి   భక్తితో భుజించుట చాల ఉత్తమము. 
       సర్వేజనా స్సుఖినో భవన్తు....
       ఓం శాన్తిః..ఓం శాన్తిః..ఓం శాన్తిః..

Comments