కదలిరా నా దరికి
కదలిరా నా దరికి
నా జీవన స్రవంతివిచంచల మంజుల వాణివి
నిష్కల్మష ప్రియ బాంధవివి
నీలో జలకాలాడక నా మేనికి కాంతి లేదు
మహారాష్ట్రలో సెలయేరుగా
పెరిగి తెలుగునాట
మహామూర్తిగా రూపుదాల్చి
నన్ను లాలింప వచ్చిన లలితా..
నీ చల్లని స్పర్శతో పండుతున్నాయి బంగారు పంటలు
నీ మధుర స్పర్శ లేనిదే నా మనసు కు శాంతి లేదు
నీ పవిత్ర స్పర్శ లేనిదే నాకు జీవనమే లేదు
ఎన్ని జన్మలు గడిచినా నీ సాహచర్యాన
నే పొందిన హృదయానుభూతి -
అమూల్యం - అపూర్వం
ఓ కృష్ణవేణి కదలిరా నా దరికి ...

Comments
Post a Comment