నేనే నువ్వు - నువ్వే నేను
నేనే నువ్వు - నువ్వే నేను
భగవాన్ ...
నేను పూరిగుడిసెలో ఉన్నా లేక
రాజమహలులో ఉన్నా
నేను సదా నీ వాడనే ...
నేను నిరుపేదనై ఒంటరిగా మిగలి పోయినా
ధనికుడనై భోగ భాగ్యాలతో తులతూగినా
నేను సదా నీ వాడనే ...
పన్నీటి జల్లుతో పులకరించినా
మండుటెండలకు మాడిపోయినా
నేను సదా నీ వాడనే ...
అందరు నన్నోదిలి వెళ్లిపోయినా
నువ్వే నా వాడవని అందరు నా చెంత చేరినా
నేను సదా నీ వాడనే ...
నేను పుట్టక ముందు నీ వాడనే
నేను పుట్టిన క్షణం నుండి నీ వాడనే
నేను ఈ లోకంలో ఉన్నా నీ వాడనే
నేను మరో లోకంలో ఉన్నా నీ వాడనే
నువ్వే నేనుగా - నేనే నువ్వుగా
మారేవరకు నేను నీ వాడనే ...
Comments
Post a Comment