కరోనా
నువ్వు మానవ జీవితాల దశను దిశను మార్చేశావు. నిర్భయంగా తమ బంగారు భవిష్యత్తు వైపు దూసుకువ వెళుతున్న యువతను నిర్ధాక్షిణ్యంగా వెనక్కు లాగేశావు. ఉద్యోగాల నియామకాలు, పరీక్షలు, రిజల్ట్స్, విదేశాలలో ఉపాధి అవకాశాలు అన్నీ అగమ్యగోచరమయ్యాయు నార్మల్ సిట్యుఏషన్ ఎప్పుడు ఏర్పడుతుంది తెలియని పరిస్థితి. దూరంగా ఆత్మీయులు, మనం అమితంగా ప్రేమించినవారు నీ వలన చనిపోతే, కనీసం వారిని కాటిదాకా వెళ్ళి వీడ్కోలు చెప్పలేని నిస్సహాయ పరిస్థితి. ప్రపంచంలో ఎన్ని విషాద సంఘటనలు జరిగినా, వాట్స్ యాప్ లో సంతాప సందేశాలు పంపడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి. అయినా ఓ కరోనా... నిన్ను రూపుమాపడనికి " దైవం మనుష్య రూపేణాం " అన్నట్లు ఎందరో మహానుభావులు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి, సర్వశక్తులు ధారపోసి నీ రాక్షస కోరలనుండి లక్షలాదిమంది రోగులను కాపాడుతున్న డాక్టర్ లకు ప్రపంచలోని మొత్తం మానవ జాతి ఋణపడి ఉంటుంది. భారత దేశంలో సోనూ సూద్ వంటి మహోన్నత మానవత్వం కలిగిన సినీ స్టార్స్ మరియు అనేక స్వచ్ఛంద సంస్థలు లక్షలాది రూపాయలు వెచ్చించి, తినడానికి ఆహారం కూడా లేని వలస కూలీలను ఆదుకొని, వారిని వారి స్వస్థలాలకు పంపి, వారికి పునర్జీవితాన్ని ప్రసాదించారు. భారత దేశంలో నిరుపేదలనుండి
అపర కుబేరుల వరకు ఎంతోమంది ప్రధాన మంత్రి సహాయనిధి, పి యం కేర్, సి. యం. సహాయ నిధుల ద్వారా కోట్ల రూపాయలు చందాలిచ్చి,కరోనాను ఎదర్కోటానికి సహకరించారు. అందరికి ధన్యవాదాలు,, అందరికి శుభాభివందనములు... సర్వేజనాసుఖినోభవన్తు భవన్తు.... Carona will leave the world earliest with the blessings of noblemen and saints.
Comments
Post a Comment