ఓ కవీ...
ఓ కవీ...
బి. విశ్వనాథాచారి
ఓ కవీ..
నీ కవితా స్రవంతిలో
మానవ హృదయంలో సమతా మమతలను ప్రవహింప జెయ్యి
ఓ కవీ..
ీీనీ కవితా సుమదళాలతో
శాంతి సౌహార్ధ్ర సుగంధాలను వ్యాపింప జెయ్యి
ఓ కవీ..
నీ కవితా తేజస్సుతో
మానవుని హృదయంలో అజ్ఞానాందకారాన్ని తొలగించు
ఓ కవీ..
నీ కవితా పద శర పరంపరలలో
మానవుని హృదయంలోని అహంకార మద కవాటాలను చేధించి
మానవుని హృదయంలో దాగియున్న మానవత్వానికి స్వేచ్ఛ కల్పించు
ఓ కవీ..
నీ కవితా కరవాలంతో
కలుషితమైన కులతత్వాన్ని పాతుకు పోయిన
మూడాచారపు కలుపు మొక్కలను పెళ్లగించు
ఓ కవీ..
నీ కవితా దీప్తితో
మానవుని గుండెల్లో రగిలే దురాగత
భావనలను భస్మీపటలం చెయ్యి
ఓ కవీ..
నిర్మలమై, నిర్భయమై, నిరాటంకంగా సాగుతున్న
నీ కవితా వాహినిలో మానవ హృదయంలో తుప్పుపట్టి
హరించి పోతున్న మానవత్వానికి మెరుగు పెట్టించు
ఓ కవీ..
తియ్యని నీ కవితా నాధంతో
మానవ కళ్యాణానికి మంగళవాద్యం వాయించు
Comments
Post a Comment