మనోహరి
మనోహరి
బి. విశ్వనాథాచారి
ఒక్క క్షణాన చిరుమల్లియ వోలె చిరునగవు చిందించు చుండు
మరొక్క క్షణాన ముద్దబంతి పూవు వోలె
ముద్దరాలగుచు నుండు
వేరొక్క క్షణాన పాల్గారు బుగ్గలలోన
లేత గులాబి బుగ్గలను
పూయించు
ఒక పరి నండూరి ఎంకి వోలె
కూనిరాగాలు తీయుచుండు
మరొక్క పరి కిన్నెర వోలె
అనురాగ ముప్పొంగ
పరుగిడుచు వచ్చు
వేరొక్క పరి కూనలమ్మ వోలె
ప్రేమ మీర పదముల వల్లె
వేయు
నాదు బంగారు బొమ్మ
పసిమి
వన్నెయంతయు
ఎవరికి
కన్పించనీయక తన మనము నందె దాచె.....
Comments
Post a Comment