ప్రతి రోజు భగవద్గీతలో ఒక శ్లోకం (1 వ రోజు)
శ్రీ మద్భగవద్గీత
( 1 వ అధ్యాయము, అర్జున విషాద యోగము)
ధృతరాష్ట్ర ఉవాచ :
1. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ
మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ।।
ధృతరాష్ట్రుడు : సంజయా ! నా వారైన దుర్యోధనాదులు,పాండురాజు
కుమారులైన ధర్మరాజాదులు యుద్ధము చేయుటకు ధర్మక్షేత్రమైన
కురుక్షేత్రము చేరి, అచ్చట వారేమి చేసిరి ?
(గీత " ధర్మ " శబ్దముతో ప్రారంభమైనది. ధృతరాష్ట్రునకు గల " మామకాః " అనగా నా వారు (ధుర్యోధనాదులు) అను భావమే యుద్ధమునకు కారణమైనది )
Comments
Post a Comment