9వ రోజు(ప్రతి రోజు భగవద్గీతలో ఒక శ్లోకం)

                      శ్రీమద్భగవద్గీత

 (1వ అధ్యాయము అర్జున విషాద యోగము) 

దుర్యోధనుడు ద్రోణాచార్యులవారితో ఇంకా ఇలా అన్నాడు:

అన్యేచ    బహవశ్ శూరాః  మదర్థే త్యక్త జీవితా   

నానా శస్త్ర ప్రహరణాః  సర్వేయుద్ధ విశారద II

వీరితో పాటు నా కొరకు ప్రాణము ధారపోయు వీరులు అనేకులు ఉన్నారు. వీరందరు నానాప్రకారములైన శస్త్రాస్త్రములు, ఆయుధములు కలవారు. యుద్ధమందు ప్రావీణ్యము కలవారు. 

(ఇచ్చట దుర్యోధనుడు యుద్ధములో తన  కొరకు ప్రాణము ధారపోయువారు అనేకులున్నారు అనిచెప్పినట్లుగానే ,

కురుక్షేత్ర యుద్ధములో  అనేక మంది ప్రాణత్యాగము చేసినప్పటికి, చివరకు దుర్యోధనుడు పరాజితుడై ప్రాణములను కొల్పోయెను. 



 



Comments