5వ రోజు(ప్రతి రోజు ఒక భగవద్గీత శ్లోకం)

                              శ్రీమద్భగవద్గీత

               (1వ అధ్యాయము అర్జున విషాద యోగము) 

5.  ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజ శ్చ వీర్యవాన్

      పురుజిత్కున్తిభోజశ్చశైబ్యశ్చ నరపుంగవః  II

పాండవ సైన్యంలో ధృష్టకేతుడు, చేకితానుడు, వీర్య వంతుడైన కాశీరాజు, పురుజిత్తు,  కున్తిభోజుడు, నర శ్రేష్ఠుడైన శైబ్యుడు ఉన్నారు.    

( చేది రాజైన ధృష్టకేతువు శిశుపాలుని కుమారుడు. చేసి తానును యాదవ రాజు. వీరిద్దరు ఒకొక్క ఒకొక్క అక్షోహిణీ సైన్యానికి సేనాధిపతులు.

ఒక అక్షౌహిణి సైన్యమనగా 21, 870 రథములు, 21,870 ఏనుగులు/గజములు, 65,610అశ్వములు/గుఱ్ఱములు1,09,350 కాల్బలము/నేలమీద యుద్ధము చేయు సైనికులు. ) 

Comments