22వ రోజు (రోజు ఒక భగవద్గీత శ్లోకం)
శ్రీ మద్భగవద్గీత
(1 వ అధ్యాయము, అర్జున విషాదయోగం) అర్జున ఉవాచ :
23. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః
ధార్తరాష్ట్రస్య దుర్బద్ధేర్యుద్ధే ప్రియ చికీర్షవః ।।
దుష్టుడు, దుర్బుద్ధి గల దుర్యోధనుని కొరకు యుద్ధము చేసి,
అతనికి ప్రియము జేగూర్చవచ్చిన యోధులను నేను చూచేదను.
(దుర్బుద్ధి గలవాడగు దుర్యోధనునికి ప్రియము చేయగూర్చ
వచ్చిన వారందరు కూడ యుద్ధమున మరణించిరి. దుర్బుద్ధి
గలవారు దుర్యోధనుని వలె అప యశస్సును, ఓటమిని,
చివరకు మరణమును పొందునని గీతాకారుడు సూచించు
చున్నాడు. కావున అందరు సద్బుద్ధిని ఆశ్రయించవలెను.)
)
Comments
Post a Comment