21 వ రోజు ( ప్రతి రోజు ఒక భగవద్గీత శ్లోకం)
శ్రీ మద్భగవద్గీత
(1 వ అధ్యాయము, అర్జున విషాదయోగం) సేనరుభయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత ।।
22. యావదేతాన్ నిరిక్ష్యే హం యోద్ధుకా నవస్థితాన్
కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే।।
అర్జునుడు కృష్ణునితో ఇట్లనెను : ఓ అచ్యుత ! (కృష్ణా) ఈ రణరంగములో
నేనెవరితో యుద్ధము చేయవలెనో, ఇచ్చట యుద్ధము చేయు అభిలాషతో
ఉన్నవారందరిని, నేను చక్కగ చూడకలుగునట్లు, రెండు సేనల మధ్య
అట్టి ప్రదేశములో నా రథమును నిలుపుము.
(అచ్యుత= చ్యుతి లేనివాడు, శాశ్వతుడు, సర్వజ్ఞుడు, పూర్ణ పురుషుడు,
లోపములేనివాడు, అవినాశి )
,
Comments
Post a Comment