ప్రముఖ సాహిత్యవేత్త శ్రీ గురజాడ అప్పారావు


                                            (జననం: 21.09.1862 - మరణం:30.11.1915 )
ఈ రోజు "  కన్యాశుల్కం " నాటకం వ్రాసిన  ప్రముఖ సాహిత్యవేత్త శ్రీ గురజాడ అప్పారావు గారి పుట్టిన రోజు.
 "  కన్యాశుల్కం "  వ్రాసి 125 సంవత్సరాలు దాటినా ఆ నాటకానికి ప్రజాదరణ తగ్గలేదు. ఈ నాటకం అనేక భారతీయ, విదేశీ భాషలలో అనువదించ బడింది. కన్యాశుల్కం( పెళ్ళిలో  వధువు తల్లి తండ్రులకు  ఇచ్చే కట్నం ) దురాచారానికి వ్యతిరేఖిస్తూ, వేశ్యావృత్తిని నిరసిస్తూ వ్యవహారిక భాషలో వ్రాసిన  ఈ నాటకం తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించింది. ఈ నాటకం లో మోసగాడు గిరీశం, వేశ్య మధుర వాణి, రామప్ప పంతులు పాత్రలు ఆనాటి సమాజానికి నిలువుటద్దాలు. అలాగే వీరు రాసిన దేశభక్తి గీతం "  దేశమును ప్రేమించుమన్నా " అనే దేశభక్తి గేయం ఎందరినో ప్రభావితం చేసింది.  ఈ గేయంలోని కొని చరణాలు -
దేశమును ప్రేమించుమన్నా 
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్
గటిమేల్ తలపెట్టవోయ్
   పాడిపంటలు పొంగిపొరలే దారిలో
   నువ్వు పాటు పడవోయ్
   తిండి కలిగితే కండకలదోయ్
   కండకలవాడేను మనిషోయ్
చట్టపట్టాల్ పట్టుకొని
దేశస్తులంతా నడువవలెనోయ్
అన్నదమ్ములవలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్
     ఈ విధంగానే  కన్యాశుల్కానికి బలైన చిన్నారి ఇతివృత్తాన్ని " పుత్తడి బొమ్మ పూర్ణమ్మ " అనే కరుణాత్మక గేయం గా రచించారు.  కరుణ రసాత్మకమైన ఈ కథను కళ్లకు కట్టినట్లుగా మన ఎదుట సాక్షాత్కరింప చేసిన గురజాడ తెలుగు సాహిత్యంలో అజరామరుడు.
ఈ గేయంలోని కొని చరణాలు -
పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడి బొమ్మ పూర్ణమ్మా

ఏయే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువుల అందించి
బంగరు దుర్గను భక్తితో కొలిచెన
పుత్తడి బొమ్మ పూర్ణమ్మా

కాసుకు లోనై తల్లీ తండ్రీ
నెనరూ న్యాయం వీడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక
వొక ముదుసలి మొగుడికి ముడి వేస్త్రీ

కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిము జేరెను మేని పసల్
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ.






















Comments